
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ ప
కనీస వేతనాలు అమలు చేయాలి
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్
మోమిన్‌పేట: కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని పెన్నార్, కార్తికేయ, ఓల్టాగ్రీన్ కంపెనీలలో పని చేస్తున్న కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కంపెనీలలో 12 గంటలు పని చేయించుకొంటున్నా కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. దీనిపై అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రోజుకు 12 గంటలు పని చేయించుకొంటున్న యాజమాన్యం రూ.12 వేల నుంచి రూ.18 వేలు మాత్రమే అందిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలను రూ.26 వేల నుంచి రూ.32 వేల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు ఈ నెల 20వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెకు సంబంధించి వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 72వ ప