
సేంద్రియ సాగుతో అధిక లాభాలు
మొయినాబాద్: సేంద్రియ వ్యవసాయంతో రైతులకు అధిక లాభాలు కలుగుతాయని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఏ.మాధవి, పి.లీలారాణి అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సురంగల్‌లో పంటల సాగు, భూసార పరిరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సేంద్రియ పద్ధతిలో పంటలు సాగుచేస్తే అధిక దిగుబడులతోపాటు నేల ఆరోగ్యాన్ని, భూసారాన్ని పరిరక్షించుకోవచ్చన్నారు. భూసార పరీక్షలు చేయించి నేల స్వభావాన్ని బట్టి తగిన మోతాదులో జీవన ఎరువులు వాడాలని సూచించారు. పంటల సాగులో రైతులు శాసీ్త్రయ పద్ధతులను అవలంబించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ అనురాధ, పీహెచ్‌డీ విద్యార్థులు రాజ్‌కుమార్, నవ్య, అశోక్, ఏఈఓ కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
వర్సిటీ శాస్త్రవేత్తలు మాధవి, లీలారాణి