
భక్తిభావాన్ని అలవర్చుకోవాలి
షాబాద్: ప్రతి ఒక్కరూ భక్తిభవాన్ని అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హైతాబాద్ గ్రామంలో శ్రీ సీతారాముల, లక్ష్మణ, భరత, శత్రజ్ఞ, హనుమంతుని విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ దైవ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.