
ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య
హయత్‌నగర్: రోడ్డు ప క్కన చెట్టుకు టవాల్‌తో ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు ల కథనం ప్రకారం.. కుంట్లూరు నుంచి గౌరెల్లికి వెళ్లే రహదారిలో నర్సరీ పక్కన వేప చెట్టుకు ఓ వ్యక్తి టవాల్‌తో ఉరేసుకుని మృతి చెందాడు. స్థానికులు గుర్తించి సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. సంఘటనా స్థలానికి వారు చేరుకొని మృతుడి వివరాలపై ఆరా తీశారు. ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వయ సు సుమారు 45 ఏళ్లు ఉంటాడని, ఎరుపు రంగు టీషర్టు ధరించాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దేవాలయంలో చోరీ
అబ్దుల్లాపూర్‌మెట్: ఆలయంలోకి చొరబడి రెండు కిలోల వెండి, 22 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిఽధిలోని బలిజగూడలో శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో రోజు మాదిరిగానే ఆలయ అర్చకుడు భూషణ్ బుధవారం సాయంత్రం 6.30 గంటలకు పూజలు నిర్వహించారు. అనంతరంఆలయ తలుపులకు తాళాలు వేసి ఇంటికి వెళ్లా డు. గురువారం తెల్లవారు జామున 4గంటలకు గ్రామానికి చెందిన మెరుగు నర్సింహ అనే వ్యక్తి భూషన్‌కు ఫోన్ చేసి గుడి తలుపులు తెరిచి ఉన్నాయని సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా తలుపులు విరగ్గొట్టి ఉంది. స్థానికుల సహకారంతో పరిశీలించగా ఉత్సవమూర్తులకు అలంకరించిన వెండి, బంగారు ఆభరణాలు కనిపించలేదు. అపహరణకు గురైన వెండి 2 కిలోలు, బంగారం 22 గ్రా ముల వరకు ఉంటుందని ఆలయ అర్చకుడు భూషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.