
రోడ్డు దాటుతుండగా కారు ఢీ
అక్కడికక్కడే వృద్ధుడి మృతి
ఇబ్రహీంపట్నం: రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంపేట్‌కు చెందిన మద్దెల ఎట్టయ్య (70) స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో ప్రజ్ఞా కళాశాల సమీపంలో రోడ్డు దాటుతుండగా ఆరుట్ల వైపు వేగంగా వెళ్తున్న కారు, అదుపు తప్పి ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన ప్రమాదస్థలంలోనే మరణించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, బాడీని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి మృతదేహాన్ని తరలించారు.
ఎఫ్‌టీఎల్‌లో మట్టి డంపింగ్
తుర్కయంజాల్: గంగరాయన్ చెరువులో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. ఎన్‌ఓసీ పేరుతో చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో వందలాది టిప్పర్ల మట్టి నింపుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
విద్యుదాఘాతంతో ఆవు మృతి
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం బైరంపల్లిలో బుధవారం సాయంత్రం విద్యుదాఘాతంతో ఆవు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరిపేట మల్లయ్య తన ఆవును పొలం వద్ద మేపుతుండగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఆవు విలువ రూ.70 వేలు ఉంటుందని, బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

రోడ్డు దాటుతుండగా కారు ఢీ