
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని కమ్మెట చౌరస్తాలో ఆదిగురువు శ్రీదక్షిణామూర్తి ఆలయాన్ని గ్రామానికి చెందిన పాండురంగం నిర్మించారు. బుధవారం ఈ మందిరాన్ని ఎమ్మెల్యే కాలె యాదయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మదచల గురుపీఠ రాజయోగాశ్రమ సేవా సమాఖ్య సభ్యుల సమక్షంలో ఏర్పాటు చేసిన గురు మందిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు దైవ చింతన అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగులు వెంకటేశం, హన్మంత్‌రెడ్డి, సురేందర్, రాంచంద్రయ్య, రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠాపన పూజలకు ఆహ్వానం
కందుకూరు: పులిమామిడిలో పునఃనిర్మించిన శివరామాంజనేయ స్వామి విగ్రహప్రతిష్ఠాపన పూజలకు హాజరవ్వాలని ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సబితారెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం వారు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు పూజాకార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దామోదర్‌గౌడ్, శ్రీనివాస్, పాండుగౌడ్, మల్లయ్య, వెంకట్‌రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.
క్షతగాత్రులను ప్రభుత్వ
ఆస్పత్రులకే తరలించాలి
108 సిబ్బందికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచన
షాద్‌నగర్: పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 108 సిబ్బంది, వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రులకు తరలిస్తున్నారనే విమర్శలున్నాయని.. పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
పీఎస్‌కు వచ్చేవారితో
మర్యాదగా మెలగాలి
కడ్తాల్: పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో మర్యాదగా వ్యవహరించడంతోపాటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని శంషాబాద్ డీసీపీ రాజేశ్ సూచించారు. కడ్తాల్ పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎస్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల ఫైళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. అఽధికారులు ఇచ్చే సలహాలు, సూచనలను పాటిస్తూ విధులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తూ సమాజంలో పోలీసుల గౌరవాన్ని పెంచాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ గస్తీ పెంచాలని ఆదేశించారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ గంగాధర్, ఎస్‌ఐ శివశంకర వరప్రసాద్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్యను సన్మానిస్తున్న పాండురంగం దంపతులు

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత