
ఇచ్చిన హామీలు అమలు చేయాలి
మొయినాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమనాయకులు దేశమొళ్ల ఆంజనేయులు, జి.వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ పరిధిలోని అజీజ్‌నగర్‌లో మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మర్చిపోయిందని విమర్శించారు. ఉద్యమకారుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. ఉద్యమకారులు సర్వం కోల్పోయి కష్టనష్టాలకోర్చి జీవనం సాగిస్తున్నారని.. అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. సమావేశంలో ఉద్యమకారులు మహిపాల్, సునీల్‌కుమార్, నవీన్‌కుమార్, చంద్రయ్య, మహేందర్, నర్సింలు, భిక్షపతి తదితరులు ఉన్నారు.
తెలంగాణ ఉద్యమనాయకులు