
హక్కుల సాధనకు సమష్టి పోరు
బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్
షాద్‌నగర్: హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ అన్నారు. మండల పరిధిలోని అయ్యవారిపల్లిలో మంగళవారం బీసీ సేన మండల మహిళా అధ్యక్షురాలు జక్కుల జలజ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా బీసీలు అన్ని రంగాల్లో వెనకబడే ఉన్నారన్నారు. ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలు రాణించాలని ఆకాంక్షించారు. తమ హక్కులు సాధించుకునేందుకు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో బీసీ సేన కమిటీలను ఎన్నుకుంటుంన్నామన్నారు. గ్రామ నూతన కమిటీని ఎన్నుకొని నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్, నర్సింలు, జయ, శ్రీకాంత్, వసంత పాల్గొన్నారు.
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
చాంద్రాయణగుట్ట: మహిళ హత్య కేసులో నిందితుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ గోపి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..కేశవగిరి హిల్స్ ప్రాంతానికి చెందిన కెతావత్ బుజ్జి(40)కి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన జుల్ఫికర్ అలీ(43)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి తీరితీసింది. మొదట్లో జల్‌పల్లిలో నివా సం ఉండే జుల్ఫికర్ ఆ తర్వాత కేశవగిరికి మకాం మార్చాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ బుజి అతడిపై ఒత్తిడి చేసింది. అయితే తనకు అప్పటికే పైళ్లె పిల్లలున్న నేపథ్యంలో అలీ పెళ్లి అంశాన్ని దాట వేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న బుజ్జి అలీకి ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరింది. అ ందుకు అతను నిరాకరించడంతో ఫోన్‌లోనే దూషించింది. దీనిని అవమానంగా భావించిన అలీ ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా 8న రాత్రి ఆమె ఇంటికి వెళ్లిన అలీ బుజ్జి గొంతు కోసి హత్య చేయడమేగాక, ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహానికి నిప్పంటించి పరారయ్యాడు. మంటలు రావడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
గంజాయి నిందితుడి అరెస్ట్
రాజేంద్రనగర్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సాలోని గజపతి జిల్లాకు చెందిన సుదీప్ కుమార్ జెన మంగళవారం రాజేంద్రనగర్ వీపీ నర్సి ్డంహా రావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 240 నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తున్నాడు. విశ్వసనీయమైన సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు దాడులు చేసి సుదీప్ కుమార్‌ను అరెస్ట్ చేసి 11.825 కేజీల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నారు. సుదీప్ కుమార్ గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి ఆరాంఘర్, చింతల్‌మేట్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిపాడు.