
గృహిణి అదృశ్యంపై కేసు నమోదు
పహాడీషరీఫ్: గృహి ణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన అస్లాం అన్సారీ తన భార్య నజ్మా కాతూన్(23), పిల్లలతో కలిసి ఎనిమిది నెలల క్రితం జీవనోపాధి నిమిత్తం జల్‌పల్లి గ్రామానికి వలస వచ్చారు. ఈ నెల 11వ తేదీన ఉదయం పిల్లలతో కలిసి అస్లాం నిద్రిస్తుండగా, ఇంట్లో ఎవరికి చెప్పకుండా నజ్మా బయటికి వెళ్లిపోయింది. ఎంతకి రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బిహార్‌కే చెందిన సిరాజ్ అన్సారీ అనే వ్యక్తిపై అనుమానం ఉందంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 87126 62367 నంబర్‌లో సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.
యువతి అదృశ్యం
మొయినాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైంది. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎనికేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనికేపల్లికి చెందిన వడ్డె కవిత(23) మంగళవారం ఉదయం 8 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

గృహిణి అదృశ్యంపై కేసు నమోదు