
ద్విచక్ర వాహనాల ఢీ
తీవ్ర గాయాలతో వ్యక్తి మృతి
కడ్తాల్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని అన్మాస్‌పల్లి–కడ్తాల్ రహదారిపై చోటు చేసుకుంది. సీఐ గంగాధర్ తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని గానుగుమార్లతండాకు చెందిన మునావత్ సోమ్లా నాయక్(38) సోమవారం రాత్రి తండా నుంచి ద్విచక్రవాహనంపై కడ్తాల్‌కు వస్తున్నాడు. అదే సమయంలో రామస్వామి అనే వ్యక్తి బైక్‌పై కడ్తాల్ నుంచి గానుగుమార్లతండాకు బయలుదేరాడు. మార్గమధ్యలో మల్లప్ప ఫౌల్ట్రీఫాం సమీపంలో సోమ్లానాయక్ బైక్‌ను రామస్వామి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇరువురికీ తీవ్ర గాయాలయ్యాయి. సోమ్లానాయక్‌కు తీవ్ర గాయాలవ్వడంతో 108 వాహనంలో మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతుడి సోదరుడు పాండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రామస్వామికి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.