
ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ
కడ్తాల్: ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గానుగుమార్లతండాకు చెందిన మూడవత్ సోమ్లా ద్విచక్రవాహనంపై సోమవారం రాత్రి తండా నుంచి కడ్తాల్ వైపు వస్తున్నాడు. అదే సమయంలో రామస్వామి అనే వ్యక్తి కడ్తాల్ నుంచి అన్మాస్‌పల్లి బయలుదేరాడు. మార్గమధ్యలో కడ్తాల్– అన్మాస్‌పల్లి రహదారిపై ఇద్దరి బైక్‌లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడినవారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇద్దరికి తీవ్ర గాయాలు