
ప్రమాదవశాత్తు పౌల్ట్రీ యజమాని మృతి
కేశంపేట: కోళ్లకు దాణా పంపిణీ చేసే యంత్రం పైన పడటంతో పౌల్ట్రీ ఫాం యజమాని మృతిచెందిన ఘటన కాకునూర్ శివారులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లీల్యానాయక్ (48) ఊరి శివారులో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులతో ఫాంలోని దాణా యంత్రం పక్కకు జరిగింది. బీహర్ చెందిన కూలీలు కమల్‌సాదా, చింటూసాదాతో కలిసి సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా మిషన్ ఒక్కసారిగా ముగ్గురిపైనా పడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా లీల్యానాయక్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. గాయాలపాలైన చింటూ, కమల్‌సాదా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ నరహరి తెలిపారు.
ఉద్యమకారుడిని కోల్పోయాం.
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న లీల్యానాయక్ మృతి బీఆర్‌ఎస్‌కు తీరని లోటని మాజీ ఎంపీపీ ఎల్గనమోని రవీందర్ యాదవ్ అన్నారు. పీఏసీఎస్ చైర్మెన్ గండ్ర జగదీఽశ్వర్‌గౌడ్ తదితరులు లీల్యా మృతిపై సంతాపం వ్యక్తంచేశారు.
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే టీఆర్‌ఆర్
పరిగి: కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని సోమవారం పరిగి ఎమ్మె ల్యే టీ రామ్మోహన్‌రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.