
ప్రమాదకరంగా గొడుగోనిపల్లి రోడ్డు
దోమ: మండలంలోని గొడుగోనిపల్లి వద్ద బీటీ రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. గతంలో కురిసిన వర్షాలకు రోడ్డు ఇరువైపులా కోతకు గురై భారీ గుంతలు ఏర్పడ్డాయి. వాహనదారులు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాల బారిన పడటం ఖాయంగా కనిపిస్తోంది. రోడ్డు కోతకు గురై నెలలు కావస్తున్నా అధికారులు మరమ్మతులు చేపట్టడం లేదు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మట్టి కూడా పోయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కోతకు గురైన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.