
7 సార్లు..5,402 ఫోన్లు
గచ్చిబౌలి: చోరీకి గురైన సెల్ ఫోన్ల రికవరీలో (సీఈఐఆర్ పోర్టల్ ఆధారంగా) దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తున్నామని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ఎల్‌సీనాయక్ అన్నారు. చోరీకి గురైన ఫోన్లలోని సమాచారాన్ని కాపాడుకోవడంలో వినియోగదారులకు సరైన అవగాహన ఉండటం లేదన్నారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను 7వ సారి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఈఐఆర్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ఆధారంగా చోరీకి గైరెన మొబైల్ ఫోన్‌ను సులభంగా రికవరీ చేసేందుకు వీలుంటుందన్నారు. ఫోన్ పోగొట్టుకున్న తరువాత దానిలోని డేటాను రక్షించుకోవడంపై బాధితులు అవగాహన పెంచుకోవాలన్నారు. సీఈఐఆర్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేస్తే ఈఎంఐ బ్లాక్ చేయడం ద్వారా డేటా సురక్షితంగా ఉండే అవకాశం ఉందన్నారు. సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇచ్చి యూపీఐలను లాక్ చేయాలని సూచించారు.ఈ సందర్భంగా రూ.95 లక్షల విలువైన 310 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు. మాదాపూర్ సీసీఎస్ పరిదిలో 80, బాలానగర్ సీసీఎస్‌లో 65, మేడ్చల్‌లో 55, రాజేంద్రనగర్ 55, శంషాబాద్ పరిధిలో 55 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 5402 ఫోన్లను బాధితులకు అందజేసినట్లు డీసీపీ వివరించారు.
సైబర్ బాధితుల్లో విద్యావంతులే అధికం
ఇటీవలి కాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిందని, బాధితుల్లో విద్యావంతులే అత్యధికంగా ఉన్నారని డీసీపీ పేర్కొన్నారు. సెల్ ఫోన్‌కు వచ్చే లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయరాదని సూచించారు. బంగారం ధర పెరగడంతో చైన్ స్నాచింగ్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. వేసవిలో తలుపులు వేసుకోకుండా నిద్ర పోవద్దన్నారు. ఊరికి వెళితే పక్కవారితో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలను తగ్గించవచ్చారు.
సెల్‌ఫోన్ల రికవరీలో
మొదటి స్థానం సాధిస్తాం
డేటా పరిరక్షణపై
అవగాహన అవసరం
సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ
ఎల్‌సీనాయక్

7 సార్లు..5,402 ఫోన్లు