మరో ఇద్దరికి గాయాలు
ఆమనగల్లు: విఠాయిపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన అజయ్‌కుమార్(30) మృతిచెందాడు. ఆమనగల్లు ఎస్‌ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన స్నేహితులు మనోజ్, అజయ్‌కుమార్, గణేశ్, త్రిముర్తులు స్విఫ్ట్ కారులో శ్రీశైలం వెళ్తున్నారు. విఠాయిపల్లి సమీపంలో పంది అడ్డు రావడంతో అజయ్‌కుమార్ కారును ఒక్కసారిగా పక్కకు తిప్పాడు.
వాహనం అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అజయ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
మహేశ్వరం: వైద్య సేవల్లో నర్సుల పాత్ర ఎంతో కీలకమని అవేర్ సంస్థ చైర్మన్ మాధవన్‌జీ అన్నారు. మండల పరిధిలోని భగవతిపురంలో సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి, నర్సులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అవేర్ సంస్థ డీజీ రాజవర్ధన్‌రెడ్డి, అవేర్ ఆస్పత్రి ఎండీ, ప్రొఫెసర్ ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు.