
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కడ్తాల్: గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని 12,13 వార్డుల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం గూడూరు మాట్లాడుతూ.. డ్రైనేజీ పనులను పూర్తి చేసి, వినియోగంలోకి తెస్తామని పేర్కొన్నారు. మండలంలో సీడీఎఫ్, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు రూ.1.30 కోట్లతో సీసీరోడ్డు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజేశ్, మాజీ సర్పంచ్ చెన్నయ్య, నాయకులు శ్రీను, రమేశ్, భానుకిరణ్, మహేశ్, శ్రీకాంత్, రామకృష్ణ, నరేశ్, చింటు తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి