
వీర జవాన్లకు ఘన నివాళి
ఇబ్రహీంపట్నం: పాకిస్తాన్‌తో పోరాడి వీరమరణం పొందిన జవాన్లకు ఇబ్రహీంపట్నంలోని ఏబీసీడీ డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో ఆదివారం కొవ్వొత్తులతో అంజలి ఘటించారు. జవాన్లు మురళీనాయక్, సచిన్‌యాదవ్, రావ్ వనాంజేల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ప్రజల భద్రతకు ప్రాణాలను పణంగా పెట్టిన జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోలేదని అకాడమి మాస్టర్ ముత్యం అన్నారు. కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్స్ సురేశ్, బన్నీ, తారలు పాల్గొన్నారు.
పరామర్శ
ఆమనగల్లు: భారత్, పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులు మురళీనాయక్ కుటుంబ సభ్యులను ఆమనగల్లు మండలం మేడిగడ్డతండాకు చెందిన పలువురు గిరిజన సంఘం, సేవాలాల్ సంఘం నాయకులు పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ సత్యసాయిజిల్లా పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి గోరంట్ల మండలం కల్లితండాల్లో ఆదివారం జవాన్ కుటుంబీకులను గిరిజన నాయకులు నేనావత్ రవీందర్‌నాయక్, శంకర్‌నాయక్, దశరథ్‌నాయక్, దేవీలాల్, ప్రకాశ్‌లు పరామర్శించారు. మురళీ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.
పూజలు
సైనికుల క్షేమం కోసం ఆమనగల్లు పట్టణంలోని హనుమాన్ దేవాలయంలో ఆదివారం ఆలయ పూజారి రామకృష్ణశర్మ నేతృత్వంలో బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు విక్రంరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో బీజేపీ మాజీ కౌన్సిలర్ సుండూరి శేఖర్, నాయకులు లక్ష్మణ్, రవిరాథోడ్, ప్రశాంత్, ఎర్రవోలు మహేశ్, జగన్‌రెడ్డి, పవన్‌కల్యాణ్, సాయిబాబా, శ్రీనివాసాచారి, రామస్వామి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి
జవాన్ కుటుంబీకులకు పరామర్శ

వీర జవాన్లకు ఘన నివాళి

వీర జవాన్లకు ఘన నివాళి