
పూర్వ విద్యార్థుల సందడి
అబ్దుల్లాపూర్‌మెట్: ఆత్మీయ పలకరింపులు, భావోద్వేగాల నడుమ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ కుత్బుల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2009– 10 విద్యాసంవత్సరం పదో తరగతి విద్యార్థులు.. సుదీర్ఘ కాలం అనంతరం పాఠశాల వేదికగా సందడి చేశారు. బాల్యం జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటూ కేరింతలు కొట్టారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గురువులు రంగారెడ్డి, శ్రీనివాస్, యాదయ్య గౌడ్, జంగాచారి, గోదాదేవి, గీతా శ్యామల, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
పోల్కంపల్లిలో..
ఇబ్రహీంపట్నం రూరల్: పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. మండల పరిధి పోల్కంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల (2007– 08 విద్యాసంవత్సరం) టెన్త్ విద్యార్థులు 17 ఏళ్ల అనంతరం ఒకే వేదికగా సందడి చేశారు. చిననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాటి ప్రధానోపాధ్యాయురాలు వసంతరెడ్డి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల సందడి