
బీజేపీలో పలువురి చేరిక
యాచారం: బీఆర్‌ఎస్ నాయకురాలు, నల్లవెల్లి మాజీ సర్పంచ్ శోభ, ఆమె భర్త బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు రాములు, పలువురు కార్యకర్తలు ఆదివారం నగరంలోని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి సమక్షంలో కాషాయం కండువా కప్పుకొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపాల్‌గౌడ్, యాచారం మండల అధ్యక్షుడు విజయ్‌నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్ మధుకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ విద్యార్థులకు సన్మానం
ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలోని శ్రీ అభయాంజనేయస్వామి సన్నిధిలో ఆదివారం ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో పది, ఇంటర్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు మాధవి, అశోక్, చందన, కిశోర్, వైష్ణవి, దృవాంశలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సత్యనారాయణ, సత్తయ్య, సాయికుమార్, మురళీధర్, పరమేశ్, సుధాకర్, లింగం, ఈశ్వరయ్య,లింగప్ప, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఆలయ విస్తరణకు చర్యలు
కందుకూరు: మండలంలోని లేమూరు పరిధిలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు నిర్వాహకులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రముఖ స్తపతి శివనాగిరెడ్డి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విస్తరణకు చేయాల్సిన పనుల గురించి మాట్లాడారు. ప్రస్తుతం దేవాలయాన్ని ఆగమ శాస్త్రం ప్రకారం తీర్చిదిద్దేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆలయ నిర్వాహకులు ఆయన్ని కోరారు. అందులో భాగంగా మహా మండపం, ధ్వజస్తంభం, బలిపీఠం, రాజగోపురం, కోనేరులను తిరిగి నిర్మించాల్సి ఉంటుందని ఆలయ నిర్వాహకులకు శివనాగిరెడ్డి తెలిపారు. ఆయన వెంట ఆలయ నిర్వాహకులు గూడూరు కొండారెడ్డి, ఢిల్లీ బాలకృష్ణ, రావిచెట్టు ఐలయ్య, ఢిల్లీ గణేష్, కేశిడి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీలో పలువురి చేరిక