
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత
కడ్తాల్: ప్రజారోగ్య పరిరక్షణే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధి న్యామతాపూర్ గ్రామానికి చెందిన సంతోజు పరిపూర్ణచారి ఆరోగ్య సమస్యలతో నగరంలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అనంతరం వైద్య ఖర్చుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఎమ్మెల్యే కసిరెడ్డి సహకారంతో బాధితుడికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.82 వేలు మంజూరయ్యాయి. ఈ మేరకు ఆదివారం బాధితుడికి.. ఎమ్మెల్యే కసిరెడ్డి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బోదాస్ మహేశ్ తదితరులు ఉన్నారు.
మంచాలలో..
మంచాల: కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని కాంగ్రెస్ జిల్లా నాయకుడు, మాజీఎంపీపీ కొర్ర శ్రీనివాస్ నాయక్ అన్నారు. అనారోగ్యంతో ఇటీవల చనిపోయిన లోయపల్లిగ్రామ వాసి తోడుసునూటి లచ్చలుకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయం కింద ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో రూ.60 వేలు మంజూరు అయ్యాయి. ఈ మేరకు ఆదివారం లోయపల్లిలో బాధిత కుటుంబీకులకు చెక్కు అందజేశారు. ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాం దాస్, నాయకులు రమేష్ గౌడ్ పాల్గొన్నారు.

సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత