
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
ఆమనగల్లు: ఆమనగల్లు పట్టణంలోని గంగాభవాని కాలనీలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. వేదపండితుల ఆధ్వర్యంలో ఉదయం 5 గంటలకు సుప్రభాతం, ధ్వజారోహనం, అభిషేకం, అలంకర ణ, ప్రత్యేక పూజలు, హనుమాన్‌హోమం, పూర్ణా హుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు బాలకృష్ణయ్య, కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సత్తయ్య, కోశాధికారి సాయికుమార్, సభ్యులు పరమేశ్, అప్పి, సుధాకర్, లింగం, ఈశ్వరయ్య, యాదగిరి, లింగప్ప, అశోక్ ఉన్నారు.