
ముగిసిన సమ్మర్ క్యాంపు
అనంతగిరి: వికారాబాద్ పట్టణం ఆలంపల్లిలో స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థులకు పది రోజులుగా నిర్వహించిన సమ్మర్ క్యాంపు ఆదివారంతో ముగిసింది. శిక్షణలో భాగంగా విద్యార్థులకు గేమ్స్, స్పోర్ట్స్‌తో పాటు ఖురాన్ పఠనం, నైతిక విలువలు తదితర అంశాలలో తర్ఫీదునిచ్చారు. ముగింపు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేయడంతో పాటు శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు అంజద్ హుస్సేన్, యూనిట్ అధ్యక్షుడు రఫీయొద్దీన్, ఆర్గనైజేషన్ వికారాబాద్ ఇంచార్జి అబ్దుల్ వాసే తదితరులు పాల్గొన్నారు.