
అనుమతి లేకుండా ఫంక్షన్‌లో మద్యం వినియోగం
మొయినాబాద్: ఎలాంటి అనుమతి లేకుండా ఫంక్షన్‌లో మద్యం వినియోగిస్తున్న ఫాంహౌస్‌పై ఎకై ్సజ్ పోలీసులు దాడి చేశారు. ఢిల్లీ, గోవా రాష్ట్రాలకు చెందిన రూ.4 లక్షల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తోలుకట్టలో నగరానికి చెందిన తేజా రెడ్డి ఫాంహౌస్ ఉంది. శనివారం రాత్రి ఇక్కడ ఓ ఫంక్షన్ నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫంక్షన్‌లో మద్యం వినియోగిస్తున్నారు. సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ ఎకై ్సజ్ పోలీసులు అర్థరాత్రి ఫాంహౌస్‌పై దాడి చేశారు. ఫంక్షన్‌లో వినియోగిస్తున్న ఢిల్లీకి చెందిన 50 బ్లాక్ లేబులు బాటిళ్లు, గోవాకు చెందిన నాలుగు యివాస్‌రీగల్ బాటిళ్లు, తెలంగాణకు చెందిన 3 లిక్కర్ బాటిళ్లు, 12 బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దాడి చేసి పట్టుకున్న ఎకై ్సజ్ పోలీసులు