అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది | - | Sakshi
Sakshi News home page

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది

May 11 2025 12:18 PM | Updated on May 11 2025 12:18 PM

అమ్మ

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది

ఆతల్లి పిల్లలు అందరూ ప్రభుత్వ ఉద్యోగులే

బొంరాస్‌పేట: మండల పరిధిలోని గౌరారానికి చెందిన ఎర్రోళ్ల రాములు, అంజిలమ్మకు ఆనందం, సురేఖ, రాజేందర్‌, విజయ్‌, వసంత ఐదుగురు సంతానం. వ్యవసాయ కూలీలుగా పనిచేసే భార్యాభర్తలు పిల్లలతో కలిసి హాయిగా జీవిస్తున్నారు. పిల్లలు ప్రాథమిక విద్యలో ఉండగానే తండ్రి అకాలమరణం చెందాడు. దీంతో అన్ని బాధ్యతలు అంజిలమ్మపై పడ్డాయి. భర్తను కోల్పోయిన బాధ వేధిస్తున్నా.. తన పిల్లలను బతికించుకోవడమే ధ్యేయంగా సాగింది. కూలీ పనులు చేస్తూనే వారిని బడికి పంపింది. పిల్లలను బాగా చదివించింది. కట్‌ చేస్తే.. పెద్ద కొడుకు ఆనందం పంచాయతీ కార్యదర్శిగా, సురేఖ ప్రభుత్వ ఉపాధ్యాయినిగా(ఎస్‌ఏ ఇంగ్లిష్‌), రెండో కొడుకు రాజేందర్‌ విద్యుత్‌ శాఖలో ఉద్యోగిగా, చిన్న కొడుకు విజయ్‌ ఎస్‌ఐగా, చిన్నకూతురు వసంత ఎస్‌ఐగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

కలలు నిజమయ్యాయి

నాభర్త 2010లో చనిపోయాడు. 15 ఏళ్ల నుంచి నా కొడుకులు, కూతుళ్లకు తండ్రిలేడనే లోటు లేకుండా పెంచా. ఆయన ఆలోచన ప్రకారం అందరు బాగా చదవాలని కోరుకున్నా. అలాగే చదివించాను. అందరికీ సర్కారు కొలువులు రావడం చాలా ఆనందంగా ఉంది.

– ఎర్రోళ్ల అంజిలమ్మ, గౌరారం

అమ్మే.. నాన్నలా..

ఇబ్రహీంపట్నం: భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితంలో ఊహించని పిడుగుపడింది. విధి వక్రీకరించి భర్త మరణించడంతో దిక్కులేని స్థితిలో బతుకు భారంగా మారింది. అయినా పిల్లలను పోషించుకునేందుకు లాండ్రీ షాపు నిర్వహిస్తూ అద్దె ఇంట్లో కాలం వెళ్లదీస్తోంది. పట్టణంలోని గోల్కొండ శ్రీలతకు బీఎన్‌రెడ్డిలోని ఓ ప్రైవేట్‌ విద్యాసంస్థలో వ్యాన్‌ డ్రైవర్‌గా పనిచేసే రాజుతో 2007లో వివాహం జరిగింది. వీరికి వైష్ణవి, సాయికార్తీక్‌ సంతానం. పెళ్లయిన నాలుగేళ్లకే రాజు మరణించాడు. అత్తవారి ఇంటి వదవ్ద ఆస్తిపాస్తులు కూడా లేకపోవడంతో ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. తన పిల్లలను అనాథలుగా మార్చేందుకు ఇష్టం లేక.. కన్నీటిని దిగమింగుకుని తన కాళ్లపై నిలబడాలని నిర్ణయించుకుంది. స్థానికంగా లాండ్రీషాపు ప్రారంభించి ఇద్దరు పిల్లను చదివిస్తోంది.

ఆరుగురు కూతుళ్ల ‘ఆరోగ్య’ లక్ష్మి

కొడంగల్‌: ఆరుగురు ఆడ పిల్లలు ఉన్నారని ఆ తల్లి ఏనాడూ చిన్నబుచ్చుకోలేదు. కొడుకులైనా, బిడ్డలైనా ప్రయోజకులైతే చాలని భావించింది. అందరినీ బాగా చదివించింది. ప్రస్తుతం వీరందరూ వైద్యారోగ్య శాఖలో విధులు నిర్వర్తిస్తున్నారు. రావులపల్లికి చెందిన లక్ష్మి, అంజయ్యగౌడ్‌ గీత కార్మికులు. కులవృత్తే వీరి జీవనాధారం. ఆడ పిల్లలకు చదువెందుకు అనుకోకుండా రెక్కల కష్టంతో బిడ్డలను చదివించారు. మొదటి కూతురు జయమాల, రెండో కూతురు అనురాధ అంగడిరాయ్‌చూర్‌ పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంలుగా, మూడో కూతురు అరుణజ్యోతి జీఎన్‌ఎమ్‌గా, నాలుగో కూతురు ఉమలత ఎమ్‌ఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్స్‌గా, ఐదో కూతురు రాధిక తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బీఎస్సీ నర్సింగ్‌, ఆరో కూతురు శిరీష జీఎన్‌ఎమ్‌ స్టాప్‌ నర్స్‌గా పనిచేస్తున్నారు. నలుగురు పెద్ద కూతుళ్లకు వివాహం చేశారు.

ఆయన ఆకాంక్ష నెరవేరింది

పిల్లలను బాగా చదివించి, టీచర్లుగా చేయాలనేది నా భర్త ఆకాంక్ష. ఆయన అప్పటికే కవి, రచయిత. ఆయన ఆశయం మేరకు పిల్లలను చదివించా. నా ముగ్గురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులుగా సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక తల్లిగా ఇంతకన్నా సంతోషం ఏముంటుంది.

– నూర్జహాన్‌బేగం, రిటైర్డ్‌, అటెండర్‌

ముగ్గురు ఉపాధ్యాయుల తల్లి

అనంతగిరి: బషీరాబాద్‌ మండలం పర్వత్‌పల్లికి చెందిన మహబూబ్‌, నూర్జహాన్‌కు దంపతులకు నస్రీన్‌బేగం, యాసిన్‌, మోసిన్‌ ముగ్గురు సంతానం. ప్రభుత్వ పాఠశాలలో నైట్‌ వాచ్‌మన్‌గా పనిచేసే మహబూబ్‌ 1987లో జరిగిన రైలు ప్రమాదంలో అకాల మరణం చెందారు. అప్పటికీ పిల్లల వయసు ఏడేళ్లలోపే. భర్త మృతితో కారుణ్య నియామకం కింద నూర్జహాన్‌కు మైల్వార్‌ ప్రభుత్వ పాఠశాలలో (1988) అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చారు. ఎన్ని కష్టాలు ఎదురైనా తన పిల్లలను ప్రయోజకులను చేయాలనే ఏకై క లక్ష్యంతో ముందుకు సాగింది. అనేక కష్టాల మధ్య తల్లిని అనుసరిస్తూ పెరిగిన పిల్లలు కష్టపడి చదివారు. ముగ్గురూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించారు. పెద్దమ్మాయి నస్రీన్‌బేగం ప్రస్తుతం బోయిన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో, ఉపాధ్యాయుడైన యాసిన్‌ ఎస్‌సీఆర్‌టీలో ఫ్యాకల్టీగా, మోసిన్‌ మర్పల్లి మండలం పిల్లగుండ్ల ప్రాథమికోన్నత పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. శివారెడ్డిపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ 2020లో నూర్జహాన్‌ విరమణ పొందారు. ప్రస్తుతం వికారాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.

‘మాతృ’భూమికి ఇద్దరు సైనికులు

దుద్యాల్‌: మండల పరిధిలోని హస్నాబాద్‌కు చెందిన గొల్ల ఎల్లమ్మ, అనంతయ్య దంపతులకు రాములు, మల్లేశ్‌, సంతోష్‌ ముగ్గురు సంతానం. అనంతయ్య అకాల మృతితో పిల్లల భారం ఎల్లమ్మపై పడింది. తన బాధను గుండెల్లోనే దాచుకుని ముగ్గురు కొడుకులను చదివించింది. పెద్ద కుమారుడు రాములు సైన్యంలో సేవలందించి, పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం బ్యాంకులో గార్డుగా ఉద్యోగం చేస్తున్నారు. 2016లో ఇండియన్‌ ఆర్మీలో చేరిన రెండో కొడుకు మల్లేశం సైనికుడిగా దేశరక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిన్నకొడుకు మల్లేశం ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. దేశానికి ఇద్దరు సైనికులను అందించిన ఎల్లమ్మకు మదర్స్‌ డే సెల్యూట్‌.

హ్యాపీ మదర్స్‌ డే

అందరి జీవితంలోనూ అమూల్యమైన వ్యక్తి అమ్మ. బిడ్డల కోసం ఆమె పడే ఆరాటం అంతాఇంతా కాదు. మా అమ్మానాన్నలకు మేం నలుగురం ఆడపిల్లలమే. అమ్మ ప్రోత్సాహమే నన్ను నిలబెట్టింది. ప్రస్తుతం నాకు కూడా ఓ కూతురు (మైరా) ఉంది. అమ్మలందరికీ మదర్స్‌ డే శుభాకాంక్షలు.

– సుశీల ఎస్‌ఐ, షాద్‌నగర్‌.

షాద్‌నగర్‌ రూరల్‌: మహేశ్వరం మండలం పెద్దమ్మతండాకు చెందిన మంగ్యానాయక్‌, మోతీ దంపతులకు జ్యోతి, సుశీల, రుక్మిణి, అరుణ నలుగురు ఆడపిల్లలు. నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన వీరికి వ్యవసాయమే ప్రధాన ఆధారం. తండాలో పుట్టిన తన పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని మోతీ నిర్ణయించుకుంది. తామెన్ని ఇబ్బందుల్లో ఉన్నా బిడ్డల చదువుల విషయంలో ఏనాడూ వెనకడుగు వేయలేదు. ఈక్రమంలో జ్యోతి ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌గా, సుశీల ఎస్‌ఐగా, రుక్మిణి టీచర్‌గా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 2020 బ్యాచ్‌కు చెందిన సుశీల ప్రస్తుతం వికారాబాద్‌ జిల్లా కరాన్‌కోట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది 1
1/12

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది 2
2/12

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది 3
3/12

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది 4
4/12

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది 5
5/12

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది 6
6/12

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది 7
7/12

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది 8
8/12

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది 9
9/12

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది 10
10/12

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది 11
11/12

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది 12
12/12

అమ్మ ప్రోత్సాహమే గెలిపించింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement