
వేసవిలో దున్ను.. దిగుబడులకు దన్ను
షాబాద్: పంటల సాగులో శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాని ఏఓ వెంకటేశం తెలిపారు. పలు సందర్భాల్లో రైతులు తీసుకునే సొంత నిర్ణయాలు దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. వేసవి దుక్కులతో కలిగే లాభాలను వివరించారు.
● పంట కొయ్యలను కాల్చకుండా,
కలియదున్నాలి.
● వేసవిలో లోతు దుక్కులతో చాలా ప్రయోజనాలున్నాయి.. పురుగులు, తెగుళ్లు, కలుపును నివారించడంతో పాటు భూమి పొరల్లో వర్షపునీరు ఇంకి పంటకు ఉపయోగపడుతుంది.
● ఏప్రిల్, మే నెలలు వేసవి దుక్కులకు అనుకూలం.
● అడ్డం, పొడవు సాళ్లలా కాకుండా ఏటవాలుగా దున్నడం శ్రేయస్కరం.
● ఏటవాలు దుక్కులతో భూమి కోతకు గురికాకుండా ఉంటుంది.
● లోతుగా దున్నినప్పుడు పంటలకు హాని చేసే క్రిమికీటకాలతో పాటు లార్వా దశలో ఉండే గుడ్లు సూర్యకిరణాలు పడి నాశనమవుతాయి.
● తొలకరి వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు వేసుకునే అవకాశం కలుగుతుంది.
● అంతకుముందే రెండుసార్లు దున్నితే గట్టిగా ఉన్న భూమి గుల్లబారుతుంది.
● ఇది కలుపును నియంత్రించడంతో పాటు నేలలో ఎక్కువ కాలం తేమ నిల్వ ఉండేలా దోహదపడుతుంది.
● భూమి పొరల్లోకి గాలి చేరుతుంది.
● సూక్ష్మజీవుల సాంద్రత, సేంద్రియ కర్బన వినియోగం పెరుగుతుంది.
● మొక్క వీటిని నేరుగా గ్రహించే అవకాశం ఉంటుంది.
● కలుపు, పురుగు మందుల అవశేషాలతో మొక్కలకు కీడు కలగకుండా ప్రభావం చూపుతుంది.
● గాలిలో ఉన్న నత్రజని వర్షపు నీటితో కలిసి భూ మిలోకి చేరడం వల్ల భూసారం పెరుగుతుంది.
● పురుగుమందులు, తెగుళ్ల మందుకయ్యే పెట్టుబడిని తగ్గించుకోవచ్చు.
లోతైన దుక్కులతో పంటలకు పుష్టి
తొలకరి వర్షాలకేవిత్తనాలు వేసుకునే అవకాశం
ఏటవాలు సాళ్లతో భూమి కోతకు అడ్డుకట్ట
వ్యవసాయశాఖ అధికారి వెంకటేశం