
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట
షాద్‌నగర్‌రూరల్: నిరుపేదల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్దలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం భవనం నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరుపేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాన్ని నాణ్యతతో నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు శ్యాంసుదర్, బాల్‌రాజ్‌గౌడ్, వెంకటేశ్‌గుప్తా, రాజు, శివలింగం, అందె మోహన్, శ్రీనివాస్, ఖదీర్, శ్రీశైలం, రాజేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్