
షాద్‌నగర్ కవులకు సత్కారం
షాద్‌నగర్: హైదరాబాద్‌లోని త్యాగరాయగాన సభలో తెలుగు భాషా చైతన్య సమితి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం తెలుగు భాష సదస్సు, కవి సమ్మేళనం నిర్వహించారు. షాద్‌నగర్ పట్టణానికి చెందిన కవులు నరేందర్‌రా వు, రవిప్రకాష్ హర్మాళ్ తమ కవితలు వినిపించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షు డు బడే సాబ్, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కాసిం,విశ్రాంత ప్రొఫెసర్ జయరాములు వారి ని సత్కరించి, ప్రశంసా పత్రాలు అందజేశారు.
చొరబాటుదారులను
వెనక్కి పంపండి
డీజీపీకి ఫిర్యాదు
మీర్‌పేట: మహేశ్వరం నియోజకవర్గంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ ముస్లింలు, రోహింగ్యాలను గుర్తించి వారి దేశాలకు తరలించాలని బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు చింతల రాఘవేందర్ ముదిరాజ్ గురువారం డీజీపీ జితేందర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం రాఘవేందర్ మాట్లాడుతూ.. అక్రమ చొరబాటుదారులతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నందున, వారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యహరించా లని అన్నారు. నియోజకవర్గంలో అధిక సంఖ్య లో నివసిస్తున్న వారితో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని డీజీపీకి వివరించినట్లు చెప్పారు. దీనికి డీజీపీ సానుకూలంగా స్పందించారని, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ నాయకురాలు హైందవిరెడ్డి ఉన్నారు.
లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఇబ్రహీంపట్నం రూరల్:భూ సమస్యలపరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భా రతి చట్టం తీసుకొచ్చిందని, ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు సర్వేయర్లు అవసరమని కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెవెన్యూ పరిపాలనకు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగం సహా యంగా రాష్ట్రంలో 5,000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఇందు కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్‌ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ దరఖాస్తులు ఆహ్వానిస్తోందన్నారు.అన్ని మీ సేవా కేంద్రాల్లో రూ.100 చెల్లించి దరఖాస్తు ప్రాస్పెక్టస్ పొందొచ్చని, మీ సేవా కేంద్రాల్లోనే ఈ నెల 17వ తేదీ వ రకు సమర్పించాలని సూచించారు. ఇంటర్‌లో గణితంలో 60 శాతం మార్కులు సాధించిన వారు, ఐటీఐ డ్రాఫ్ట్‌స్‌మెన్, డిప్లోమా (సివిల్), బీటెక్ (సివిల్) సమానమైన అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన అభ్య ర్థులకు జిల్లా ప్రధాన కేంద్రాల్లో 26వ తేదీ నుంచి 50 పని దినాల్లో శిక్షణ ఇస్తారన్నారు.
నేడు ‘డయల్ యువర్ డీఎం’
మహేశ్వరం: ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని, సత్వరం పరిష్కరించేందుకు శుక్రవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు స్థానిక డిపో మేనేజర్ లక్ష్మీసుధ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యా హ్నం 12 నుంచి ఒంటిగంట వరకు ప్రయాణికులు 91542 98784 నంబర్‌కు ఫోన్ చేయా లని తెలిపారు. సలహాలు, సూచనలు అందించడంతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయాలని కోరారు. ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకొని కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
నాణ్యమైన విత్తనాలు
అందుబాటులో ఉంచాలి
మాడ్గుల: నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు అన్నారు. మండలంలోని ఇర్విన్ గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారి కార్యాలయంలో రికారులు పరిశీలించారు. మండలస్థాయి అధి కారులు రైతులకు ఎప్పటికప్పుడు అందుబా టులో ఉండి సలహాలు, సూచనలు అందించా లని ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్య వసాయాధికారి అరుణకుమారి, విస్తరణ అధి కారులు జోష్న, భార్గవి, రాజేష్ పాల్గొన్నారు.

షాద్‌నగర్ కవులకు సత్కారం