
సమస్యలు పరిష్కరించండి
చేవెళ్ల: పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, గౌరవ అధ్యక్షుడు సందీప్ గురువారం మహేందర్‌రెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అదే విధంగా ఈనెల 10న నిర్వహించే రాష్ట్ర స్థాయి పంచాయతీ కార్యదర్శుల సదస్సుకు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ లేని గ్రామాల్లో కార్యదర్శులే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, ఆయా గ్రామాల్లో ఫీల్డ్‌అసిస్టెంట్‌లను నియమించాలని కోరారు. క్రీడా కోటాలో ఎంపికై న 98మంది జీపీఏఎస్‌లను తొలగించిన నేపథ్యంలో వారిని తిరిగి సర్వీస్‌లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి సానుకులంగా స్పందించారని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రవిశెట్టి, ప్రధాన కార్యదర్శి సంజీవ్‌కుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.