
సబ్‌రిజిస్ట్రార్‌పై దాడి అమానుషం
ఇబ్రహీంపట్నం రూరల్: విధి నిర్వహణలో ఉన్న పెద్దఅంబర్‌పేట్ సబ్‌రిజిస్ట్రార్‌పై దాడి చేయడం అమానుషమని గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామారావు, కార్యదర్శి శ్రీనేష్ కుమార్ నోరీలు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ సెక్రెటరీ బుద్ధ ప్రకాష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సబ్‌రిజిస్ట్రార్‌పై దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే జైలుకు పంపించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణ ప్రకారం పని చేస్తారన్నారు. అధికారులు తప్పు చేస్తే ఫిర్యాదులు చేయాలి కాని, భౌతిక దాడులకు పాల్పడటం తగ దని హెచ్చరించారు. గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టరేట్ నందు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినట్లు చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించే వరకు ఉరుకోబోమని తెలిపారు. కార్యక్రమంలో స్టాంప్స్, సబ్‌రిజిస్ట్రార్ సంఘం బాధ్యులు సహదేవ్, స్తితి ప్రజ్ఞ, వెంకటేష్, నూతనగంటి వెంకట్, శాంతి శ్రీ, అలివేలు, లక్ష్మణ్ స్వామి, సుజాత, సైదమ్మ, నాగేశ్వర్‌రావు, సీడీపీఓ, ఈఈఎస్, డీఈఈఎస్, కలెక్టరేట్ గజిటెడ్, నాన్ గెజిటెడ్, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
తీవ్రంగా ఖండించిన గెజిటెడ్ అధికారుల సంఘం