
ఘనంగా ‘అవంతి’ వార్షికోత్సవం
అబ్దుల్లాపూర్‌మెట్: గుంతపల్లి లోని అవంతి ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆ విద్యాసంస్థల చైర్మన్, ఏపీ మాజీ మంత్రి ముత్తెంఽశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, నవతేజా టెక్నాలజీస్ డైరెక్టర్ ఏరె సంగమ్కర్, అవంతి విద్యాసంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రియాంక హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ జయప్రద, ప్రిన్సిపల్స్ శేషతల్పసాయి తదితరులు పాల్గొన్నారు.