
నేడు మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన
కొత్తూరు: నాట్కో ట్రస్ట్ సహకారంతో నిర్మించిన కొత్తూరు జెడ్పీహెచ్‌ఎస్ భవనాన్ని బుధవారం ప్రారంభించనున్నట్లు మండల విద్యాధికారి అంగూర్‌నాయక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి పాఠశాలను ప్రారంభిస్తారని చెప్పారు.
వేసవి శిబిరాలను
సద్వినియోగం చేసుకోండి
డీఈఓ సుశీంధర్‌రావు
కొత్తూరు: ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న వేసవి శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి సుశీంధర్‌రావు కోరారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిబిరాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న అంశాల గురించి నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. శిబిరాలకు వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు ఆసక్తి ఉ న్న విభాగాన్ని ఎంపిక చేసుకుని నేర్చుకోవా లని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ అంగూర్‌నాయక్, ఉపాధ్యాయులు రాజు, నవనీత, శిబిరం నిర్వాహకులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్మికులసమస్యలు పరిష్కరించండి
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి
కొత్తూరు: పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ విభాగం పంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఈ నెల 20న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మె నోటీసును ఎంపీడీఓ అరుంధతికి అందజేశారు. అనంతరం నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు పంచాయతీ కార్మికుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వాలు స్పందించి కార్మికుల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో విడతల వారీగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, కార్మికులు సురేష్, దేవయ్య, బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఎరువుల వాడకం
మోతాదుకు మించొద్దు
పర్యావరణ, సహజ వనరుల విభాగం డైరెక్టర్ డాక్టర్ కేపీ వాణి
చేవెళ్ల: రైతులు పొలాలకు మోతాదుకు మించి ఎరువులు వాడొద్దని పర్యావరణ, సహజ వనరుల విభాగం డైరెక్టర్ డాక్టర్ కేపీ వాణి సూచించారు. మండల పరిధిలోని చనువెళ్లి గ్రామంలో మంగళవారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేపీ వాణి మాట్లాడుతూ.. రైతులు రసాయన ఎరువులు వాడకం తగ్గించాలన్నారు. పంటకాలం ముగిసే వరకు ఎరువులు, విత్తనాలు, మందులకు సంబంధించిన రసీదులు భద్రపరుచుకోవాలని చెప్పారు. సాగునీటిని ఆదా చేస్తూ పంట మార్పిడి విధా నం అవలంబించాలన్నారు. అనంతరం హార్టికల్చర్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ డి.రజిని మాట్లాడుతూ.. కూరగాయలు, ఆయిల్‌పామ్ సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. పచ్చిరొట్ట ఎరువులతో భూసారం పెరుగుతుందని పంటల దిగుబడికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతుల గురించి రైతులకు వివరించారు. ఈ సందర్బంగా రైతులు తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు శంకర్‌లాల్, జి.రమ్య, రైతులు, నాయకులు పాల్గొన్నారు.

నేడు మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన

నేడు మంత్రి శ్రీధర్‌బాబు పర్యటన