
రోహింగ్యాలను వెనక్కి పంపండి
● శరణార్థుల కార్డులు లేకుండానే నివాసం ● బాలాపూర్ పీఎస్ ఎదుట బీజేపీ నేతల ఆందోళన ● మహేశ్వరం డివిజన్ ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి హామీతో విరమణ
పహాడీషరీఫ్: బాలాపూర్ మండలంలో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాలను వెంటనే వెన క్కి పంపాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి జల్‌పల్లి మున్సిపల్ పరిధి రాయల్ కాలనీలో నివాసం ఉంటున్న రో హింగ్యాల క్యాంప్‌లను పరిశీలించారు. వారు ఎప్పు డొచ్చారు.?వారి వద్ద శరణార్థుల కార్డులున్నాయా.? అని పరిశీలించారు. అనంతరం బాలాపూర్ ఠాణా ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా అందెల మాట్లాడుతూ.. యూపీఏ సర్కా ర్ హయాంలో శరణార్థుల ముసుగులో వచ్చిన విదేశీయులు బాలాపూర్‌లో 20 వేల మంది వరకున్నార ని.. వీరికి కార్డులు సైతం లేవన్నారు. ఆధార్, ఓటర్ ఐడీలు అక్రమంగా సంపాదించి సిమ్ కార్డులు, బైక్‌లు, కార్లు కొనుగోలు చేసి దర్జాగా ఉంటున్నార ని మండిపడ్డారు. వీరికి మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పిస్తున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉదయం 5 గంటలకే నిద్రలేచే రోహింగ్యాలు హిందువుల బ స్తీల్లో చెత్త సేకరించే వారిగా తిరుగుతూ,మన సమాచారాన్ని ఇతర దేశాలకు చేరవేస్తున్నారని ఆరోపించారు. భారత్ యుద్ధం మొదలుపెడితే మన పక్కనే ఉన్న వీరు మనపై దాడులకు తెగబడే ప్రమాదం ఉందన్నారు. వీరిని పంపించేందుకు హిందూ బంధువులంతా పార్టీలకతీతంగా స్పందించాలన్నారు. వీరి విషయంలో బాలాపూర్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పూర్తి సమాచారంతో రాచకొండ పోలీస్ కమిషనర్‌ను కలుస్తామని ఆయన స్పష్టం చేశారు. 15 రోజుల్లో వీరిపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తామని మహేశ్వరం డివిజన్ ఏసీపీ లక్ష్మీకాంత రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.