
బాధితురాలికి పరామర్శ
కడుపులోనే కవలలను పోగొట్టుకున్న ఎల్మినేడు గ్రామానికి చెందిన కీర్తి ఘటనపై జిల్లా వైద్యాధికారులు స్పందించి విజయలక్ష్మి ఆస్పత్రిని సీజ్ చేశారు. బాధితురాలు కీర్తిని చికిత్స నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం సీఐ జగదీశ్ మంగళవారం గాంధీ ఆస్పత్రికి వెళ్లి కీర్తిని పరామర్శించి.. జరిగిన ఘటనపై విచారణ జరిపారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆమె సీఐకి వివరించారు. కాగా విజయలక్ష్మి ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పనితీరుపై జిల్లా వైద్యాధికారుల రిపోర్టు ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ జగదీష్ వెల్లడించారు.