
ఫ్యూచర్ అథారిటీలో చోటు కల్పించాలి
యాచారం: ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలో మంతన్‌గౌరెల్లి, మంతన్‌గౌడ్, సుల్తాన్‌పూర్ రెవెన్యూ గ్రామాలను కలిపేందుకు కృషి చేయాలని మంతన్‌గౌరెల్లి గ్రామస్తులు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి వినతిపత్రం అందజేశారు. బుధవారం మంతన్‌గౌరెల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కొర్ర అరవింద్ నాయక్ ఆధ్వర్యంలో నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు. మండల పరిధిలోని 20 రెవెన్యూ గ్రామాలకు గాను 17 రెవెన్యూ గ్రామాలను యూడీఏలోకి తీసుకుని మిగిలిన మూడు రెవెన్యూ గ్రామాలను వదిలేశారని తెలిపారు. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, మంతన్‌గౌడ్ రెవెన్యూ గ్రామాలను సైతం యూడీఏలోకి తీసుకునేలా కృషి చేయాలని కోరారు. యూడీఏలోకి తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని మంతన్‌గౌరెల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బీఎన్‌ఆర్ ట్రస్ట్ చైర్మన్ బిలకంటి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీలు దెంది రాంరెడ్డి, కె.శ్రీనివాస్‌రెడ్డి, నల్లవెల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మీపతిగౌడ్, నాయకులు లిక్కి రాజారెడ్డి, కారింగ్ యాదయ్య, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
నేదునూరు గ్రామస్తుల ధర్నా
కందుకూరు: ఫ్యూచర్ సిటీ అథారిటీలోకి తమ గ్రామాన్ని సైతం చేర్చాలని నేదునూరు గ్రామస్తులు డిమాండ్ చేశారు. బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు స్వచ్ఛందంగా శ్రీశైలం హైవేపై నేదునూరు గేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. ఫ్యూచర్ సిటీ అథారిటీలోకి మేజర్ గ్రామ పంచాయతీ నేదునూరును విస్మరించడం బాధాకరమన్నారు. శ్రీశైలం రహదారికి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలోనే తమ గ్రామం ఉందన్నారు. ఆ రహదారికి వంద మీటర్ల దూరం నుంచే తమ రెవెన్యూ పరిధి ప్రారంభమవుతుందన్నారు. తమ గ్రామంపై వివక్ష చూపడం సరికాదన్నారు. అథారిటీలో కలిపే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కె.రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కె.బాలరాజ్, మాజీ ఉప సర్పంచ్‌లు బి.శ్రీనివాస్, జి.ప్రభాకర్‌రెడ్డి, యు.సాయిలు, వివిధ పార్టీల నాయకులు ఐ.రాకేష్‌గౌడ్, ఎస్.అమరేందర్‌రెడ్డి, ఎ.కుమార్, ఎస్.వెంకటేష్, పి.సురేందర్‌రెడ్డి, బి.సురేష్, శ్రీనివాస్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, కృష్ణనాయక్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు మూడు రెవెన్యూ గ్రామాల వినతి

ఫ్యూచర్ అథారిటీలో చోటు కల్పించాలి