
ఎమ్మెల్యే సబితారెడ్డిని కలిసిన బీఆర్‌ఎస్ శ్రేణులు
మహేశ్వరం: ప్రతిపక్షమైనా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెచ్చేందుకు పోరాడుతామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. ఆదివారం ఆమెను మండల పరిధిలోని గొల్లూరు గ్రామానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు గ్రామ సమస్యలను వివరించారు. ఇందుకు స్పందించిన సబితార్డెఇ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ లీగల్ సెల్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌చారి, పార్టీ గొల్లూరు గ్రామ అధ్యక్షుడు ఆనంద్, పార్టీ సీనియర్ నాయకులు దర్శన్, మాదయ్య, హరిశంకర్, భిక్షపతి, పోషయ్య, నర్సింహ, శ్రీశైలం, విజయ్, శివ కుమార్, వినయ్, సుజన్ కుమార్, శ్రీకాంత్, సత్తయ్య, యాదయ్య, మురళీకృష్ణ గౌడ్, చిన్న యాదయ్య, సంజీవ కుమార్, యాదయ్య, పాల్త్యా టోప్యా నాయక్, మహేశ్ గౌడ్ పాల్గొన్నారు.
మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి