రూ.7.50 లక్షల విలువ
అబ్దుల్లాపూర్‌మెట్: గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అతని నుంచి రూ.7.50 లక్షల విలువ చేసే 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ బృందం, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సంయుక్తంగా పెద్దఅంబర్‌పేట ఔటర్ వద్ద గురువారం రాత్రి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన వినోద్‌కిషన్ రావు భాస్కె అలియాస్ సోను వృత్తి రీత్యా లారీడ్రైవర్. గంజాయిని అక్రమంగా సరఫరా చేసి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు పంపారు.