
కేశంపేట: అర్హులందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామని షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ జయలక్ష్మి అన్నారు. మండల పరిధిలోని పోమాల్‌పల్లిలో జరుగుతున్న కంటివెలుగు కార్యక్రమాన్ని బుధవారం అమె పరిశీలించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ కంటి పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి అద్దాలను అందించాలన్నారు. రోజూ 150 నుంచి 200 మంది వరకు పరీక్షలను నిర్వహించాలని అమె సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ నిఖిత, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు, ఎంపీహెచ్‌ఈఓ ఆంజనేయులు, అప్తమాలజిస్ట్ కృష్ణమోహన్ పాల్గొన్నారు.