
వేలంపాట నిర్వహిస్తున్న అధికారులు
తుక్కుగూడ: మున్సిపల్ కేంద్రంలోని వార సంత (తైబజార్)కు 2023–24 సంవత్సరానికి గాను మంగళవారం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. వేలంలో ముగ్గురు పాల్గొనగా కె.ప్రవీణ్‌చారి రూ.90.15 లక్షలకు దక్కించుకున్నాడు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె.మధుమోహన్, కమిషనర్ బి.వెంకట్రామ్,వైస్ చైర్మన్ భవాని వెంకట్‌రెడ్డి, కౌన్సిల ర్ రవినాయక్,నాయకులు శివయ్య, సుధా కర్, శ్రీకాంత్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఆమనగల్లు: ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించా లని జిల్లా డీఈఓ సుశీందర్‌రావ్ ఆకాంక్షించారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర అని అన్నారు. మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 21 మంది విద్యార్థులు 2022–23 సంవత్సరానికి నిర్వహించిన కేంద్రీయ ఉపకార వేతనాలకు ఎంపిక కావడంతో మంగళవారం పాఠశాల ఆవరణలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఉపకార వేతనాలకు ఎంపికైన విద్యార్థు లను ప్రధానోపాధ్యాయుడు విజయ్ భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు రవీందర్‌రావ్, విఘ్నేశ్‌ను డీఈఓ ఘనంగా సత్కరించారు. అనంతరం డీఈఓ సుశీందర్‌రావ్ మాట్లాడుతూ.. ఎస్‌ఎస్‌సీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంఈఓ సర్దార్‌నాయక్, స్థానిక నాయకులు రాజమోని జంగయ్యయాదవ్, కొప్పుల వెంకటయ్యగౌడ్, శ్రీశైలం, భూపేశ్‌చారి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రేపు ఆన్‌లైన్ జాబ్‌మేళా
ఇబ్రహీంపట్నం రూరల్: నిరుద్యోగులకు ఈ నెల 30న ఆన్‌లైన్ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం అధికారి జయశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీఫార్మసీ, బీఫార్మసీ చదివిన అభ్య ర్థులు అర్హులని చెప్పారు. పదో తరగతి, ఇంటర్,డిగ్రీ చదివిన మెడికల్ స్టోర్‌లో అనుభవం ఉన్న అభ్యర్థులు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వేతనం నెలకు రూ.15 వేల నుంచి రూ.18వేల వరకు ఉంటుందన్నారు. అపోలో ఫార్మసీలో 100 ఖాళీలు ఉన్నాయని, జిల్లాలో పని చేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 82476 56356, 90630 99306 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
రంగంలోకి ఎస్‌బీ..
ఇంటలిజెన్స్ అధికారులు!
● సాక్షి కథనంతో కదలిక
● పోలీసు అధికారి తీరుపై అంతర్గత విచారణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఆ సారు.. రూటే వేరు’ శీర్షికన మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనం చర్చనీయాంశమైంది. సైబరాబాద్ పో లీస్ కమిషనరేట్ పరిధిలో దుమారం రేపింది. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తతంగం నడిచిందనే దానిపై జనం ఆరా తీశారు. పోలీసులే ఇలా ప్రవర్తిస్తే.. ఎవరితో చెప్పుకొంటామని మాట్లాడుకున్నారు. సదరు పోలీసు అధికారి తీరును తప్పుబట్టారు. మరోవైపు ఈ కథనంపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు వేగవంతం చేసినట్టు తెలిసింది. ఆరోపణలపై అంతర్గతంగా విచారణ జరపాలని ఎస్‌బీ, ఇంటలిజె న్స్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. విచారణ అనంతరం సదరు అధికారిపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సైబరాబాద్ సీపీ కార్యాలయంలో ఆ అధికారిపై పలు ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం.

విద్యార్థులతో డీఈఓ సుశీందర్‌రావ్