కొత్తూరు: ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఈ నెల 13న మండల పరిధిలోని మక్తగూడ గ్రామంలో సూర్యాపేటకు చెందిన మోహన్‌రావు అనే వ్యక్తి కింద పడి ఉన్నట్లు గ్రామాస్తులు డయల్ 100కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆయన్ను చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన సోమవారం మృతిచెందాడు. పెట్రోలింగ్‌లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ సంపత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.