
వేడుకల్లో పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్
శంషాబాద్ రూరల్: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని జెడ్పీ చైర్‌పర్సన్ టి.అనితారెడ్డి అన్నారు. జడ్పీటీసీ నీరటి తన్వీరాజు ఆధ్వర్యంలో ఆదివారం పెద్దషాపూర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజ సేవలో మహిళలు చొరవ చూపడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు, యువతుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నీలం, మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మ, ఎంపీటీసీ సభ్యులు గౌతమి, సంగీత, సరిత, సర్పంచులు బుచ్చమ్మ, కల్పన, నర్సమ్మ, మాధవి, తదితరులు పాల్గొన్నారు.