
జంగయ్య (ఫైల్)
కందుకూరు: ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ కొండల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని సరస్వతీగూడకు చెందిన గుల్వి జంగయ్య(45) గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతటా వెతికినా ఆచూకి లభించలేదు. దీంతో శుక్రవారం అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆచూకీ తెలిస్తే 94906 17237కు సమాచారం అందించాలన్నారు.
ముగ్గురిపై కేసు
పరిగి: పేకాట ఆడుతున్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు. భర్కత్‌పల్లి సమీపంలో శుక్రవారం కొంత మంది పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. వడ్ల శ్రీనివాస్, నర్సింహులు, కృష్ణయ్యను పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.3,500 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.