ఇల్లంతకుంట(మానకొండూర్): పార్టీ పటిష్టతకు కృషిచేయాలని కాంగ్రెస్‌లో చేరిన కార్యకర్తలను ఉద్దేశించి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండలంలోని బోటుమీదపల్లి సర్పంచ్ గౌరవేణి శివానిసుమన్‌తోపాటు ఉపసర్పంచ్ గౌరవేణి లతిక, వార్డు సభ్యుడు పరశురాములు, గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు దుర్ముట్ల పరుశరాములు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కె.భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు వి.వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, సర్పంచులు మామిడి రాజు, అరుకాల నవీన్‌కుమార్, కాత మల్లేశం, నేరెళ్ల విజయ్‌గౌడ్, మంజుల రమేశ్ పాల్గొన్నారు.
డయల్ 100 కాల్స్‌పై వెంటనే స్పందించాలి
చందుర్తి(వేములవాడ): డయల్ 100 కాల్స్‌పై వెంటనే స్పందిస్తూ.. బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహన సిబ్బంది చేరుకోవాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. చందుర్తి పోలీస్‌స్టేషన్‌ను శనివారం తనిఖీ చేశారు. ఠాణాలోని రికార్డులను, కేసుల వివరాలు పరిశీలించారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేశ్ ఉన్నారు.
ముస్తాబాద్(సిరిసిల్ల): సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పార్టీ సిరిసిల్ల ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్‌లో మోడల్ ఇందిరమ్మ ఇల్లు, నామాపూర్‌లో ఇందిరమ్మగృహాలను హౌసింగ్ పీడీ వెంకటమాధవరావుతో కలిసి శనివారం ప్రారంభించారు. పీడీ వెంకట మాధవరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు రూ.200 కోట్లను జిల్లాలో లబ్ధిదారులకు చెల్లించినట్లు తెలిపారు. డీఈ సాజిద్, ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, సర్పంచులు మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, అనిల్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంట్ కోకన్వీనర్ కనమేని చక్రధర్‌రెడ్డి, తహసీల్దార్ రామ్‌చందర్, ఎంపీడీవో లచ్చాలు, ఏఈ మనీశ్, కొండం రాజిరెడ్డి, వైస్‌చైర్మన్ వెల్ముల రామ్‌రెడ్డి పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్: ఈనెల 6న జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి ఫెడరేషన్ కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. అండర్–20 బాల, బాలికలు, మెన్ అండ్ ఉమెన్‌కు 100, 200, 400, 800, 1500, 5కేఎం, 10 కేఎం మీటర్లు పరుగుపందెంతో పాటు త్రోస్ అండ్ జంప్స్ పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. విజేతలను ఈనెల 11, 12 తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు.
‘పవర్’లూమ్స్‌కు ఊరట !
సిరిసిల్ల: స్థానిక వస్త్రపరిశ్రమకు భారీ ఊరట ల భించింది. 25 హెచ్‌పీల కంటే తక్కువ లోడ్‌ను గల ఉన్న వస్త్రోత్పత్తి యూనిట్లను కేటగిరీ–3 నుంచి మినహాయిస్తూ కేటగిరీ–4కు మార్పిడి చేశారు. దీంతో ఆయా యూనిట్ల యజమానులకు 60 శాతం మేరకు విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుంది. సిరిసిల్లలోని 600 పరిశ్రమ య జమానులకు మేలు కలిగేలా కేటగిరీ మార్పిడి చేసినట్లు ఎన్పీడీసీఎల్ సిరిసిల్ల సర్కిల్ ఎస్‌ఈ భిక్షపతి శనివారం తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలుగా గుర్తిస్తూ కేటగిరీ మార్పు చేసినట్లు వెల్లడించారు. వస్త్రపరిశ్రమలో ఈ మార్పుతో ఉత్పత్తి వ్యయం తగ్గిపోయి స్థానిక నేతకార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఈఎస్ పేర్కొన్నారు. ఇంకా కేటగిరీ మార్పు కోసం అర్హులైన పరిశ్రమల యజమానులు ఎన్పీడీసీఎల్ అధికారులను సంప్రదిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి కేటగిరీ మార్పునకు అవకాశం కల్పిస్తామని భిక్షపతి వివరించారు.
రూ.20కోట్ల విద్యుత్ సామగ్రి సిద్ధం
వేసవి నిర్వహణలో భాగంగా జిల్లాకు రూ.20కోట్ల విలువైన విద్యుత్ సామగ్రిని అందుబాటులోకి తెచ్చామని ఎస్‌ఈ భిక్షపతి వివరించారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి ఆదేశాలతో ‘సెస్’ పెద్దూరు స్టోర్స్‌కు రూ.10కోట్ల విలువైన సామగ్రి ఇప్పటికే చేరగా.. మరో రూ.10కోట్ల విలువైన సామగ్రి సిద్ధంగా ఉందన్నారు. ఇందులో 120 కి.మీ. కండక్టర్ వైర్లు, 110 ట్రాన్స్‌ఫార్మర్ల నిల్వ సిద్ధమైందన్నారు. ఎన్పీడీసీఎల్ సిబ్బంది రక్షణకు అవసరమైన భద్రతా సామగ్రి అందుబాటులోకి వచ్చిందన్నారు.


