ఓటెత్తిన పల్లె | - | Sakshi
Sakshi News home page

ఓటెత్తిన పల్లె

Dec 12 2025 6:05 AM | Updated on Dec 12 2025 6:05 AM

ఓటెత్

ఓటెత్తిన పల్లె

పోలింగ్‌ సరళి ఇలా..(శాతంలో..)

సిరిసిల్ల: కల్లోల పల్లెల్లో మహిళా ఓటర్ల చైతన్యం వెల్లువెత్తింది. తొలిదశ పంచాయతీ ఎన్నికలు చిన్న చిన్న ఘటనలు మినహా గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 76 గ్రామ సర్పంచులకు, 295 వార్డు సభ్యులకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని చందుర్తి, కోనరావుపేట, వేములవాడ అర్బన్‌, రుద్రంగి, వేములవాడ రూరల్‌ మండలాల్లో జరిగిన ఎన్నికల్లో 79.57 శాతం పోలింగ్‌ జరిగింది. 2019 నాటి తొలిదశ ఎన్నికల్లో 82.60 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఈసారి కాస్త తగ్గింది. పల్లెల్లో ఓటర్లు ఉదయం 7 గంటలకే క్యూ కట్టి మరీ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తొలివిడత ఎన్నికలు జరిగిన ఐదు మండలాల్లో మొత్తం ఓటర్లు 1,11,148 ఉండగా.. 88,442 మంది ఓటర్లు తమ ఓటును వేశారు. జిల్లాలో 79.57శాతం పోలింగ్‌ జరిగింది.

వేములవాడ రూరల్‌లో అత్యధికం

తొలిదశలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగిన ఐదు మండలాల్లో వేములవాడరూరల్‌ మండలంలో అత్యధికంగా 82.47శాతం పోలింగ్‌ నమోదైంది. వేములవాడరూరల్‌లో 18,825 మంది ఓటర్లు ఉండగా.. 15,525 మంది ఓటుహక్కు వినియోగించుకుని 82.47 శాతం పోలింగ్‌ను నమోదు చేశారు.

● కోనరావుపేట మండలంలో 34,641 మంది ఓ టర్లు ఉండగా.. 28,420 మంది ఓటుహక్కు విని యోగించుకున్నారు. 82.04 శాతం నమోదైంది.

● చందుర్తి మండలంలో 28,094 మంది ఓటర్లు ఉండగా.. 21,823 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 77.68శాతం నమోదైంది.

● వేములవాడ అర్బన్‌ మండలంలో 18,492 మంది ఓటర్లు ఉండగా.. 14,687 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 79.42 శాతం నమోదైంది.

● రుద్రంగి మండలంలో 11,096 మంది ఓటర్లు ఉండగా.. 7,987 మంది ఓటేశారు. 71.98 శాతం నమోదైంది.

వెల్లువెత్తిన మహిళా చైతన్యం

తొలి విడత ఎన్నికలు జరిగే ఐదు మండలాల్లో 1,11,148 మంది ఓటర్లు ఉండగా ఇందులో మహిళా ఓటర్లు 57,638 మంది, పురుషులు 53,492, ఇతరులు 18 మంది ఉన్నారు. గురువారం జరిగిన ఎన్నికల్లో మహిళా ఓటర్లు 48,739 మంది, 39,693 మంది పురుషులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఐదు మండలాల్లో మహిళా ఓటర్లు 84.56 శాతం ఓట్లు వేయగా.. పురుషులు 74.20 శాతం ఓటేశారు. ఇతరులు 55.56 శాతం ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌, ఎస్పీ మహేశ్‌ బీ గీతే, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌, ఆర్డీవో రాధాబాయి, డీఎస్పీ నాగేంద్రచారి ఎన్నికలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

మండలం 9 గంటలు 11 గంటలు 1 గంటకు..

చందుర్తి 14.75 41.06 77.68

కోనరావుపేట 17.81 52.19 82.04

రుద్రంగి 18.20 46.04 71.98

వేములవాడ అర్బన్‌ 19.88 53.23 79.42

వేములవాడ రూరల్‌ 18.03 49.55 82.47

మొత్తం 17.46 48.49 79.57

ఓటెత్తిన పల్లె1
1/3

ఓటెత్తిన పల్లె

ఓటెత్తిన పల్లె2
2/3

ఓటెత్తిన పల్లె

ఓటెత్తిన పల్లె3
3/3

ఓటెత్తిన పల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement