పెద్ద ఊరు.. చిన్న పల్లె!
గ్రామపంచాయతీ ఓట్లు పురుషులు మహిళలు
గంభీరావుపేట 8,807 4,264 4,543
రుద్రంగి 8,633 4,016 4,615
ఎల్లారెడ్డిపేట 7,577 3,622 3,955
ముస్తాబాద్ 7,347 3,625 3,722
మైనర్ పంచాయతీలు ఇవీ..
గుంటుపల్లిచెరువుతండా 121 59 62
బోటిమీదిపల్లె 157 81 76
చిక్కుడువానిపల్లె 158 78 80
కొత్తపేట 163 78 85
సిరిసిల్ల: జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకాగా.. అత్యధిక ఓట్లు ఉన్న ఊరు.. అతి తక్కువ ఓటర్లు ఉన్న పల్లైపె చర్చ మొదలైంది. జిల్లా వ్యాప్తంగా 260 జీపీలకు 27 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. గురువారం తొలివిడత ఎన్నికలు 76 గ్రామాల్లో ముగిశాయి. రెండో విడత 14న, మూడో విడత 17న జరగనున్నాయి. జిల్లాలో అతిపెద్ద మేజర్ గ్రామపంచాయతీగా గంభీరావుపేట 8,807 మంది ఓటర్లతో అగ్రస్థానంలో ఉంది. నాలుగు దశాబ్దాల కిందట టౌన్ మున్సిపాలిటీగా ఉండేది. కాలక్రమేన మేజర్ పంచాయతీగా అవతరించింది. అతి చిన్న గ్రామపంచాయతీగా ఎల్లారెడ్డిపేట మండలం గుంటుపల్లిచెరువు తండా 121 ఓట్లతో ఆఖరి స్థానంలో నిలిచింది.
జనాభా ప్రాతిపదికన నిధులు
గ్రామపంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రాంట్ల రూపంలో మంజూరు చేసే నిధులు జనాభా ప్రాతిపదికన వస్తాయి. ఆయా గ్రామాల్లో ఉన్న జనాభా లెక్కల ప్రచారం తలసరి ఆదాయాన్ని అందిస్తాయి. ఈ లెక్కన జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు భారీగా నిధులు మంజూరవుతాయి. జనాభా తక్కువగా ఉన్న గ్రామాలకు తక్కువగా నిధులు వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు రుద్రంగి మండలం మానాల పెద్ద గ్రామపంచాయతీగా ఉండేది. కొత్త జిల్లాల ఆవిర్భావంతో మానాల శివారులోని ఏడు గిరిజన తండాలు కొత్త గ్రామాలుగా అవతరించడంతో మానాల మైనర్ గ్రామంగా మారిపోయింది. ఏడు గ్రామా లు.. పది గుట్టలతో మానాల విస్తరించి ఉంది.


