కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి
● ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
ఇల్లంతకుంట(మానకొండూర్): కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండలంలోని పొత్తూరు, కందికట్కూర్, గొల్లపల్లి, వెంకట్రావుపల్లి, ఓబులాపురం, వెల్జిపూర్, సోమారంపేట, రేపాక, వెంకట్రావుపల్లి గ్రామాల్లో గురువారం ప్రచారంలో పాల్గొన్నారు. దోచుకునే వారిని కాకుండా నిజాయితీగా గ్రామాభివృద్ధికి తోడ్పడే వారిని సర్పంచులుగా గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, నాయకులు ఆకుల సత్యం, యాస తిరుపతి, ఇరుమల్ల నర్సయ్య, కేశవరెడ్డి పాల్గొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రెండో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తంగళ్లపల్లి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 30 గ్రామపంచాయతీలకు మూడు జీపీ ఇప్పటికే ఏకగ్రీవం కాగా.. ఆదివారం 27 గ్రామపంచాయతీలకు పోలింగ్ జరగనుంది. కాగా దానికి అనుగుణంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను ఎంపీడీవో, జిల్లా సహాయ ఎన్నికల అధికారి కె.లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో సిద్ధం చేశారు. రిటర్నింగ్ అధికారులు, ప్రీసైడింగ్ అధికారులకు సంబంధించిన సరంజామా సిద్ధం చేశారు. ఓటర్లకు ఎలాంటి ఆటంకం కలగకుండా రిజర్వ్ సిబ్బందితోపాటు రిజర్వ్ బ్యాలెట్ బాక్సులు కూడా సిద్ధంగా ఉంచామని ఎంపీడీవో లక్ష్మీనారాయణ తెలిపారు.
ఉదయం బోసిపోయిన పోలింగ్ కేంద్రాలు
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం 8 గంటలు దాటినా ఓటర్లు కేంద్రాలకు రాలేదు. మండలంలో 28 గ్రామాలుండగా రెండు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. కనగర్తి గ్రామంలోని పోలింగ్ కేంద్రం ఉదయం 8 గంటలకు కూడా ఓటర్లు లేక బోసిపోయి కనిపించింది.
తొలిసారి ఓటేసిన
వేములవాడ: ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఉండే ఆనందం వేరు. అదే తొలిసారి ఓటు వేస్తే ఆ సంతోషం చెప్పలేనిదిగా ఉంటుంది. ఇలా వేములవాడ రూరల్ మండలం లింగంపల్లికి చెందిన వెల్మకంటి హర్షిత మొదటిసారి ఓటువేసింది. ఓటు వేసి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటుతోనే మన ఊరి భవిష్యత్‌ను మార్చుకోగలమన్నారు. తొలిసారి ఓటేయడం చాలా అద్భుతంగా అనిపించిందని ఆనందంగా చెప్పారు.
కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి


