భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● ఏర్పాట్లు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: రానున్న సమ్మక్క–సారక్క జాతర దృష్ట్యా.. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. అధికా రులతో కలిసి పనులను బుధవారం పరిశీలించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉచిత దర్శనం, కోడె క్యూలైన్, రూ.100 క్యూలైన్, రూ.300 క్యూలైన్, కళ్యాణకట్ట, వీఐపీ రోడ్డు, క్యూలైన్లు పరిశీలించారు. జాతర రోజుల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయి సన్నాహాలు చేయాలని ఆదేశించారు.
బెల్టుషాపులకు మద్యం సరఫరా అడ్డుకోవాలి
సిరిసిల్లటౌన్: బెల్టుషాపులకు మద్యం సరఫరా కాకుండా అడ్డుకోవాలని ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమిశెట్టి దశరథం కోరారు. ఈమేరకు బుధవారం సిరిసిల్ల ఎకై ్స జ్ ఆఫీసులో ఫిర్యాదు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీమీదనే ఆధారపడి పాలన సాగిస్తోందన్నారు. వైన్‌షాప్ టెండర్లు రూ.3 లక్షలకు పెంచి.. గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు నిర్వహణకు ఊతం ఇచ్చిందన్నారు. బెల్టుషాపులకు మద్యం సరఫరా చేస్తున్న వైన్స్‌లపై చర్యలు లేక జనం మద్యం మత్తులో తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారన్నారు. ఎర్రజెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య, పంతం సుజాత, గడదాస్ లత, రాజేశం, దేవదాస్, సత్తయ్య పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: మాఘ అమావాస్య రోజున సిరిసిల్ల శివారులోని మానేరునదిలో జరిగే గంగమ్మజాతర నిర్వహణపై బుధవారం ఇరిగేషన్ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఇరిగేషన్ అధికారిని రాధికరెడ్డి గంగపుత్ర సంఘం ప్రతినిధులతో కలిసి గంగాభవాని ఆలయ పరిసరాలు పరిశీలించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి జాతర ఏర్పాట్ల చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సంఘం ప్రతినిధులు డీసీసీ అధ్యకుడు సంగీతం శ్రీనివాస్‌ను కలిసి సమస్యను విన్నవించారు. గంగపుత్ర సంఘం అధ్యక్షుడు వంగల కనకయ్య, సొసైటీ అధ్యక్షుడు వంగల రాజనర్సు, మాజీ అధ్యక్షుడు మూడరీ చిన్న, గడప ప్రవీణ్, ప్రచార కార్యదర్శి కూర శ్రీధర్, మానుకోల నర్సయ్య, కూర రాజేందర్, మూడరీ నర్సింగ్, బలరాం, నర్సయ్య, దేవరాజు, భాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: ‘ఓటు చోర్ఙీపై జిల్లాలో కాంగ్రెస్ నేతలు సంతకాల సేకరణ చేపట్టారు. 27వేల సంతకాల సేకరించి బుధవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ హైదరాబాద్ గాంధీభవన్‌లో అప్పజెప్పారు. ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ ఈనెల 14న రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీతో ఈ ఓటు చోరీ కార్యక్రమాన్ని రాష్ట్రపతికి చేరవేస్తారని ఆయన తెలిపారు.
ముస్తాబాద్(సిరిసిల్ల): పంచాయతీ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు వెంటనే ప్రచార వ్యయాన్ని అధికారులకు సమర్పించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు గుగులోత్ రామచంద్రు పేర్కొన్నారు. ముస్తాబాద్ రైతువేదికలో బుధవారం సర్పంచ్, వార్డుసభ్యులకు ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పించారు. అభ్యర్థులు తమ రోజువారీ ఖర్చులను వెంటనే మండల పరిషత్‌లో సమర్పించాలని సూచించారు. పరిమితికి మించి వ్యయం చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎంపీడీవో లచ్చాలు, ఎంపీవో వాహిద్ పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి


