నిబంధనలు పాటించాలి
● ఇన్‌చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్
చందుర్తి/కోనరావుపేట(వేములవాడ): ఎన్ని కల సిబ్బంది నిబంధనలు పాటించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. చందుర్తి, కోనరావుపేటల్లోని ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతోపాటు ఇతర సామగ్రి సరిచూసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్లలోపల పీవోలకు తప్ప ఎవరికీ మొబైల్‌ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాల నిఘాలో ఉన్నాయన్నారు. మహిళలకు పూర్తి భద్రత కల్పించినట్లు చెప్పారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీవీహెచ్‌వో రవీందర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఆర్డీవో రాధాభాయి, తహసీల్దార్‌లు భూపతి, వరలక్ష్మి, ఎంపీడీవోలు రాధ, స్నిగ్ధ, సూపరింటెండెంట్ శంకర్‌రెడ్డి, ఎంపీవో అరిఫ్ పాషా, ఇతర అధికారులు ఉన్నారు.
ఏకగ్రీవ సర్పంచులకు సన్మానం
వేములవాడ: కోనరావుపేట మండలం జైసేవా లాల్‌తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇస్లావత్ మంజుల, ఉపసర్పంచ్‌గా అజ్మీరా దేవాలాల్‌నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికవడంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం సన్మానించారు. గ్రామాభివృద్ధికు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. విప్ ఆది శ్రీని వాస్ మాట్లాడుతూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న తండావాసులను అభినందించారు. గురువారం జరిగే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
నిబంధనలు పాటించాలి


