ఈవీఎంల గోడౌన్ తనిఖీ
సిరిసిల్లఅర్బన్: సర్ధాపూర్ వద్ద ఉన్న ఈవీఎంల గోడౌన్‌ను ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతే, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతకుముందు కలెక్టరేట్‌లో పలు అంశాలపై చర్చించారు. సిరిసిల్ల అర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేశ్‌కుమార్, ఎలక్షన్ అధికారి రెహమాన్ పాల్గొన్నారు.
అస్వస్థతకు గురైన జెడ్పీ సీఈవో
వేములవాడ: సర్పంచ్ ఎన్నికల విధులకు హాజరైన జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్ అస్వస్థతకు గురయ్యా రు. వేములవాడ మండల పరిషత్ ఆవరణలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు బుధవారం చేరుకున్నారు. ఈక్రమంలో అస్వస్థతకు గురై కిందపడిపోవడంతో తలకు గాయమైంది. అక్కడే ఉన్న వైద్యసిబ్బంది ప్ర థమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వై ద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లారు. ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
రుద్రంగి(వేములవాడ): ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రుద్రంగి పోలింగ్ కేంద్రాల్లోని వసతులను డీఆర్‌డీవో శేషాద్రితో కలిసి బుధవారం పరిశీలించారు. రుద్రంగి తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీవో నటరాజ్ తదితరులు ఉన్నారు.
ఈవీఎంల గోడౌన్ తనిఖీ
ఈవీఎంల గోడౌన్ తనిఖీ


