
దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
● బీఎల్‌వోలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి ● కలెక్టర్ హరిత
సిరిసిల్ల: జిల్లాలో పెండింగ్ ఓటర్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఎం.హరిత అన్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఫారం 6, 7, 8 దరఖాస్తులకు సంబంధించి, నోటీస్ పీరియడ్ జారీ చేసిన ఏడు రోజులలోగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో ప్రతీ పోలింగ్ బూత్‌కు బూత్‌స్థాయి అధికారి (బీఎల్‌వో)ల నియామకం పూర్తి కావాలని, వారికి ఐడీ కార్డులు జారీ చేయాలని సూచించారు. నూతన ఓటర్లకు ఓటర్ ఐడీ కార్డుల పంపిణీ వేగంగా పూర్తి చేయాలన్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు సీ.హెచ్.వెంకటేశ్వర్లు, రాధాభాయ్, వేములవాడ తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, ఎలక్షన్ సెక్షన్ అధికారి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.