
యూరియా ఇప్పించండి సార్లూ..
● జిల్లా వ్యాప్తంగా రైతుల రాస్తారోకో ● వేకువజాము నుంచే క్యూలైన్‌లు ● అయినా దొరకని బస్తాలు
రెండ బస్తాల కోసం గంటల తరబడి..
వీర్నపల్లి మండలం గర్జనపల్లికి 400 బస్తాల యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు 300 మంది తరలివచ్చారు. పోలీసులు క్యూలైన్‌లో నిల్చోబెట్టి ఒక్కో రైతుకు రెండు బస్తాలు ఇప్పించారు. అయినా గంటల తరబడి క్యూలైన్‌లో ఎదురుచూసేందుకు ఇబ్బంది పడ్డారు.
కూపన్లతోనే సరి
ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామాల రైతులకు సోమవారం ఇల్లంతకుంట రైతువేదికలో యూరియా కూపన్లను వ్యవసాయాధికారులు అందజేశారు. అనంతారం, రహీంఖాన్‌పేట, రేపాక, సిరికొండ, వంతడుపుల, ఇల్లంతకుంట గ్రామాల రైతులకు సాగు విస్తీర్ణాన్ని బట్టి 750 వరకు కూపన్లు అందజేసినట్లు ఏవో సురేశ్‌రెడ్డి తెలిపారు. ఏఈవోలు రవళి, అర్చన, లలిత, అభిషేక్, గంగ, తదితరులు పాల్గొన్నారు.
ఎదురుచూపులే..
యూరియా కోసం తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన రైతులకు మధ్యాహ్నం దాటిన బస్తాలు దొరక్కపోవడంతో అలసిపోయారు. చేసేదేమి లేక తమ వంతు వచ్చే వరకు ఎదురుగా ఉన్న షెట్టర్ల వద్ద పడుకున్నారు. మండల కేంద్రంలోని సాయిజ్యోతి గ్రామైక్య సంఘానికి 225 బస్తాలు వచ్చాయి. మిషన్ పనిచేయకపోవడంతో మంగళవారం ఇస్తామని అధికారులు చెప్పడంతో చేసేదేమి లేక వెనుదిరిగి వెళ్లిపోయారు.
యూరియా ఇదేం‘దయా’ !
వేములవాడలోని ప్రైవేట్ ఫర్టిలైజర్స్ దుకాణాల ఎదుట యూరియా కోసం రైతులు సోమవారం బారులుతీరారు. పత్తి, వరిపంటలకు యూరియా అవసరం కావడంతో పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. ఒక్కో రైతుకు ఒక యూరియా బస్తా, అర లీటర్ నానో యూరియా డబ్బాను ఇస్తున్నారు. వీటి కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండి తీసుకెళ్తున్నారు.
వేములవాడలో 8 మందిపై కేసు

యూరియా ఇప్పించండి సార్లూ..

యూరియా ఇప్పించండి సార్లూ..